బిగ్ అలర్ట్.. బలపడిన అల్పపీడనం.. రాగల 24గంటల్లో ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు..

  Wed Apr 09, 2025 13:57        Environment

మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం ఉదయానికి తీవ్ర అల్పపీడనంగా బలపడి నైరుతి, దానికి ఆనుకుని దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించి స్థిరంగా కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో ఉత్తర వాయవ్యంగా పయనించి మళ్లీ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత 24 గంటల్లో ఉత్తర ఈశాన్యంగా దిశ మార్చుకుని బలహీనపడుతుందని పేర్కొంది. ప్రస్తుతం తమిళనాడు వరకూ ఉపరితల ద్రోణి ఒకటి విస్తరించింది. ఇదే సమయంలో వాయవ్య భారతం నుంచి రాష్ట్రంపైకి వేడి గాలులు వీస్తుండటంతో వాతావరణ అనిశ్చితి నెలకొని మంగళవారం రాష్ట్రంలో అక్కడక్కడా ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి.

 

ఇది కూడా చదవండి: వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురు వర్షాలు, గురువారం ఉత్తర కోస్తాలో పలుచోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం అల్లూరి, ఏలూరు, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని 28 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. కాగా మంగళవారం నంద్యాల జిల్లా దొర్నిపాడు, కడప జిల్లా మద్దూరులో 41.5, కర్నూలు జిల్లా కామవరంలో 40.7, పల్నాడు జిల్లా రావిపాడులో 40.6, ప్రకాశం జిల్లా దరిమడుగులో 40.5, అల్లూరి జిల్లా ఎర్రంపేటలో 40.3, చిత్తూరు జిల్లా తవణంపల్లెలో 40.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

 

ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

 

ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా బొబ్బిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి! సభ్యులకు ఆయన కృతజ్ఞతలు..

 

ఆ విషయంలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. వివిధ రంగాల నుంచి పది మంది నిపుణులు!

 

పోసానికి మరో బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు.. మళ్లీ అరెస్ట్..?

 

ఆ జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం.. వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ.. కార్ల ధ్వంసం.!

 

వాహనదారులకు కేంద్ర బిగ్ షాక్.. ఓరి దేవుడా.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.!

 

ఏపీవాసులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ముఖ్యంగా ఈ మూడు - ప్రతీ నియోజకవర్గంలోనూ.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Rain #AndhraPradesh #APSDMA #Weather